MP Ram Mohan Naidu: శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో టీడీపీ భారీ ర్యాలీ
* ర్యాలీలో పాల్గొన్న ఎంపీ రామ్మోహన్ నాయుడు * రైతుల పట్ల జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించిన ఎంపీ రామ్మోహన్
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో టీడీపీ భారీ ర్యాలీ(ఫోటో-ది హన్స్ ఇండియా)
MP Ram Mohan Naidu: రెండున్నరేళ‌్లుగా జగన్ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తూనే ఉందని ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. ఆంధ్రా-ఒడిషా బోర్డర్ ప్రాంతమైన పాతపట్నం నియోజకవర్గంలో ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం మాట్లాడిన ఆయన రైతుల కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం 14 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, ఇప్పటి వైసీపీ ప్రభుత్వంరైతులకు అవసరమైన ఒక్క సాగునీటి ప్రాజెక్టు చేపట్టలేదని ఆరోపించారు. వంశదార, నాగావళి నదుల అనుసందానం కూడా పక్కన పెట్టారని విమర్శించారు.