Andhra Pradesh News: కేంద్రం కీలక నిర్ణయం.. చంద్రబాబుకు భద్రత భారీగా పెంపు..
Chandrababu Security: కేంద్ర నిఘా సంస్ధల హెచ్చరికల నేపథ్యంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రస్తుతం కల్పిస్తున్న జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను మరింత పెంచింది.
Andhra Pradesh News: కేంద్రం కీలక నిర్ణయం.. చంద్రబాబుకు భద్రత భారీగా పెంపు..
Chandrababu Security: కేంద్ర నిఘా సంస్ధల హెచ్చరికల నేపథ్యంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రస్తుతం కల్పిస్తున్న జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను మరింత పెంచింది. ఇందులో భాగంగానే ఇప్పటివరకూ ఇస్తున్న కమెండోల సంఖ్యను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆయనకు ఉన్న భద్రతను డబుల్ చేసింది. 6+6 కమాండోలతో ఉన్న భద్రతను 12+12 కమాండోలతో పెంచింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించగా.. ఆ ఆదేశాలకు అనుగుణంగా.. ఎన్‌ఎస్‌జీ డీజీ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబుకు తక్షణం భధ్రత పెంచుతూ ఎన్‌ఎస్‌జీ డీజీ ఉత్తర్వులు చేయగా, నిన్ననే అమరావతిలోని చంద్రబాబు ఇంటిని, టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని ఎన్‌ఎస్‌జీ డీజీ స్వయంగా పరిశీలించారు.. అంతే కాకుండా టీడీపీ కార్యాలయంలోని నాయకులతో మాట్లాడి స్ధానిక పోలీసు అధికారుల భద్రత ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. మరోవైపు తీవ్ర ఉద్రిక్తతల మధ్య చంద్రబాబు నాయుడు మూడో రోజు కుప్పం పర్యటన కొనసాగుతోంది. నిన్న, మొన్న జరిగిన ఘర్షణల నేపథ్యంలో పోలీసులు ఇవాళ మరింత అలర్ట్ అయ్యారు.