Cyclone Montha: మరింత బలహీన పడిన మెంథా తుఫాన్.. వాయుగుండంగా మారిన తుఫాన్
Cyclone Montha: మొంథా తుఫాన్ వాయుగుండంగా బలహీనపడింది. గడిచిన 6 గంటలుగా ఇది 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది.
Cyclone Montha: మరింత బలహీన పడిన మెంథా తుఫాన్.. వాయుగుండంగా మారిన తుఫాన్
Cyclone Montha: మొంథా తుఫాన్ వాయుగుండంగా బలహీనపడింది. గడిచిన 6 గంటలుగా ఇది 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. తెలంగాణ రాష్ట్రంపై దీని ప్రభావం కొనసాగుతోంది. భద్రాచలానికి 50 కిలోమీటర్లు, ఖమ్మం జిల్లాకు 110 కిలోమీటర్లు దూరంలో వాయుగుండంలో కేంద్రీకృతమైంది. ఉత్తర వాయువ్య దిశగా కదిలి క్రమంగా బలహీనపడింది. దీని కారణంగా రానున్న 12 గంటల్లో తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలు పడనున్నాయి. తెలంగాణలో ఒకట్రెండు ప్రాంతాలకు ఆకస్మిక వరద హెచ్చరికలను విశాఖ వాతావరణ కేంద్రం జారీ చేసింది.
విశాఖ, అల్లూరి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయని మిగతా జిల్లాల్లో అక్కడకక్కడ తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలు మరో 2 రోజులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.