Disha App: నలుగురి ప్రాణాలు కాపాడిన కోతి

Disha App: శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు అన్న సామెతను ఓ వానరం నిజంచేసింది. ఆత్మహత్యకు పాల్పడుతున్న తల్లితో పాటు ముగ్గురు కూతుళ్లను కోతి కాపాడింది.

Update: 2021-04-13 10:03 GMT

Disha App: నలుగురి ప్రాణాలు కాపాడిన కోతి

Disha App: శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు అన్న సామెతను ఓ వానరం నిజంచేసింది. ఆత్మహత్యకు పాల్పడుతున్న తల్లితో పాటు ముగ్గురు కూతుళ్లను కోతి కాపాడింది. దిశా యాప్ బాధితులను ఆస్పత్రికి చేర్చింది. సినీ ఫక్కీలో జరిగిన ఈ సంఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. మహిళ తన ముగ్గురు కూతుళ్లతో కలిసి ఆత్మహత్య చేసుకుంటుండగా, విషం బాటిల్ ను కోతి లాక్కెళ్లింది. దిశ యాప్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు బాధితులను ఆసుపత్రికి తరలించారు.

కర్నూలు జిల్లా నంద్యాల మండలం చాపిరేవులగ్రామానికి చెందిన ఆదిలక్ష్మికి ముగ్గురు కూతుళ్లు. గత ఏడాది భర్త చనిపోవడంతో పిల్లల పోషణభారం ఆదిలక్ష్మిపై పడింది. పదో తరగతి చదువుకున్న ఆదిలక్ష్మి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించేందుకు నంద్యాలలోని ఓ కోచింగ్ సెంటర్ లో చేరింది. బంధువుల అనుమానపు మాటలు ఆదిలక్ష్మిని బాధించాయి. తనతో పాటు పిల్లలు లోకంలో ఉండరాదని, ఆత్మహత్య చేసుకోవాలని భావించింది.

తన ముగ్గురు కూతుళ్లను నలమల్ల అడవిలోని శ్రీసర్వలక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి తీసుకెళ్లింది ఆదిలక్ష్మి. ముందుగా తన ఇద్దరు పిల్లలకు వాస్మోల్ 33 అనే హెయిర్ డైను తాగించగా, వారు ఉమ్మేశారు. చిన్న పాప తాగేందుకు ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఆదిలక్ష్మి వాస్మోల్ తాగుతుండగా చేతుల్లో నుంచి కోతి లాక్కెళ్లింది.

అపస్మారకస్థితిలో పడి ఉన్న తల్లిని చూసి చిన్న కూతురికి భయమేసింది. తన చేతిలోని స్మార్ట్ ఫోన్ నుంచి ముందుగా మామకు ఫోన్ చేసి దిశా యాప్ ను నొక్కింది. వెంటనే పోలీసులు ఘటనస్థలికి వచ్చారు. ఆదిలక్ష్మిని, ఆమె ముగ్గురు పిల్లలను నంద్యాల ఆసుపత్రికి తరలించారు. దిశా యాప్ ను అందరూ డౌన్ లోడ్ చేసుకోవాలని పోలీసులు కోరుతున్నారు. ఈ యాప్ ఆపదలో ఉన్నవారిని రక్షణలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఆదిలక్ష్మి, ఆమె ముగ్గురు కూతుళ్లను ఆత్మహత్య నుంచి వానర రూపంలో నరసింహ స్వామి వచ్చి రక్షించాడని స్థానికులు చెబుతున్నారు.

Tags:    

Similar News