MLC Elections: పశ్చిమ రాయలసీమలో ఎమ్మెల్సీ ఎన్నికలు..
MLC Elections: రేపు ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటలదాకా పోలింగ్
MLC Elections: పశ్చిమ రాయలసీమలో ఎమ్మెల్సీ ఎన్నికలు..
MLC Elections: పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో రేపు జరిగే పోలింగ్ కు సంబంధించి సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు ఎన్నికల సామాగ్రి తరలింపు కార్యక్రమాలు పూర్తయ్యాయి.
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు పోలింగ్ జరుగనుంది. ఉమ్మడి అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలో జరుగుతున్న పోలింగ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. నియోజకవర్గంలో పట్టుబద్రుల ఓటర్లు 3 లక్షల 30 వేలమంది ఉన్నారు. ఉపాధ్యాయ ఓటర్లు 28వేల148 మంది ఉన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో 49 మంది అభ్యర్థులు , ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో 12మంది పోటీ పడుతున్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 49 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో జంబో బ్యాలెట్ పేపర్ ను అధికారులు సిద్ధం చేశారు. వాటికి అనుగుణంగా ఉండేందుకు జంబో పోలింగ్ బాక్సులను తెప్పించారు పోలింగ్ కేంద్రం ఒకటే చోట ఉన్నప్పటికీ పట్టభద్రుల ఓటింగ్ కేంద్రం ఉపాధ్యాయ ఓటింగ్ కేంద్రం వేరువేరుగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. పోలింగ్ జరుగుతున్న అన్ని కేంద్రాలలోనూ వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అనంతపురం కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేయడానికి వచ్చే వారికి పోలింగ్ కేంద్రంలోని పెన్ను ఇవ్వడం జరుగుతుందని పెన్ను, ఇంకు, వాటర్ బాటిల్, సెల్ ఫోన్ వంటివి పోలింగ్ కేంద్రంలోకి అనుమతించమని కలెక్టర్ నాగలక్ష్మి స్పష్టం చేశారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి నాలుగు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని.. నియోజకవర్గంలో 21 పోలింగ్ కేంద్రాలను సమస్య ఆత్మకమైనవిగా గుర్తించామని ఆమె తెలిపారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను అనంతపురం జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌కి తరలిస్తారు. ఈ నెల 16న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు.