ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యానిది హత్యే : ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడి
MLC Anantha Babu Car: కాకినాడలో సంచలనం రేకెత్తించిన ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంది హత్యేనని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది.
ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యానిది హత్యే : ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడి
MLC Anantha Babu Car: కాకినాడలో సంచలనం రేకెత్తించిన ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంది హత్యేనని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. తీవ్రంగా కొట్టడంతో అంతర్గత అవయవాలు గాయపడినట్లు ఫోరెన్సిక్ నివేదికలో పేర్కొన్నారు. పోస్టుమార్టమ్ రిపోర్టు వెలుపలికి రాకముందే హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ అజ్ఙాతంలోకి వెళ్లిపోయారు. కాకినాడ ఏజెన్సీలో ఉన్నట్లు ఆచూకీ తెలిసింది. పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. ఈ సాయంత్రానికి అదుపులోకి తీసుకుంటారని సమాచారం. ఈ నేపథ్యంలో బెయిల్ కోసం వైసీపీ నేతలతో ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.