MLA Rapaka Vara Prasada Rao: దొంగ ఓట్ల కామెంట్లపై రాపాక వివరణ

MLA Rapaka Vara Prasada Rao:32 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనను గుర్తుచేసుకుంటూ మాట్లాడా

Update: 2023-03-28 08:54 GMT

MLA Rapaka: దొంగ ఓట్ల కామెంట్లపై రాపాక వివరణ

MLA Rapaka Vara Prasada Rao: దొంగ ఓట్ల కామెంట్లు దుమారం రేపడంతో... తన వ్యాఖ్యలపై స్పందించారు రాజోలు ఎమ్మెల్యే రాపాక. తాను ఆ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. ఎప్పుడో కార్యకర్తలతో సరదాగా ప్రస్తావించిన విషయాన్ని ఇప్పుడ జరిగినట్లు ప్రచారం చేయడం తగదన్నారు. అందరూ నవ్వుకునేందుకే ఆరోజు తాను కామెంట్స్ చేశానని వివరణ ఇచ్చారు. 32 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనను గుర్తుచేసుకుని మాట్లాడితే.. వక్రీకరించి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు రాపాక. చేతకాక ఓడిపోయిన బొంతు రాజేశ్వరరావు.. తనపై రాజేశ్వరరావు కామెంట్లు చేయడంపై మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాలకు గురిచేసిందన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానన్నారు రాపాక వరప్రసాద్. 

Tags:    

Similar News