Kotamreddy: అనుమానం ఉన్నచోట కొనసాగడం కష్టం.. రాజకీయాలకు గుడ్ బై చెబుతా..
Kotamreddy Sridhar Reddy: వైసీపీపై ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Kotamreddy: అనుమానం ఉన్నచోట కొనసాగడం కష్టం.. రాజకీయాలకు గుడ్ బై చెబుతా..
Kotamreddy Sridhar Reddy: వైసీపీపై ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధిష్టానం కొత్త డ్రామాకు తెరలేపిందన్నారు కోటంరెడ్డి. తన తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి నియోజకవర్గ సమన్వయకర్తగా ఇస్తామని చెబుతోందన్నారు. గిరిధర్‌రెడ్డి వైసీపీ తరఫున పోటీ చేస్తే.. తమ్ముడికి పోటీగా తాను నిలబడనని... రాజకీయాలకు గుడ్ బై చెబుతానని తేల్చి చెప్పారు. ఫోన్ టాపింగ్ వల్ల తన మనసు కలత చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనుమానం ఉన్న చోట కొనసాగడం కష్టమని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు.