AP Politics: వచ్చే ఎన్నికల్లో నాకు టికెట్ రాకపోవచ్చు.. మాజీ మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు..
Andhra Pradesh: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
AP Politics: వచ్చే ఎన్నికల్లో నాకు టికెట్ రాకపోవచ్చు.. మాజీ మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు..
Andhra Pradesh: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో తనకు కాకుండా తన భార్యకు టికెట్ ఇస్తారేమోనన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో జరిగిన మార్కెట్ కమిటీ సమావేశంలో మాట్లాడిన ఆయన వచ్చే ఎన్నికల్లో టికెట్ తనకు కాకుండా తన భార్యకు ఇస్తానంటే చేసేదేమి లేదన్న ఆయన సీఎం జగన్ చెప్పినట్లు పార్టీ కోసం పనిచేస్తానన్నారు. నియోజకవర్గస్థాయి నేతలంతా విభేదాలు పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం కృషిచేయాలని మాజీ మంత్రి సూచించారు. వైసీపీ కొండెపి నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు పార్టీ నాయకులు, కార్యకర్తలను పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వస్తున్నాయని, పార్టీ గెలుపు కోసం అందరితో నడవాల్సిందేనని స్పష్టం చేశారు.