స్పందన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో పాల్గొని, ప్రజల నుండి అర్జీలను సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి స్వీకరించారు.

Update: 2019-12-03 03:35 GMT
MLA Kakani Govardhan Reddy

వెంకటాచలం: మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో పాల్గొని, ప్రజల నుండి అర్జీలను వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి స్వీకరించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవల్సిందిగా అధికారులను ఎమ్మెల్యే కాకాణి సూచించారు. రైతుభరోసా పథకం ఎవరికైనా అందలేదేమోనని పరిశీలించి, అన్ని సమస్యలు పరిష్కరించి అందచేస్తామని, అర్హత కలిగిన అందరికి ఇళ్ళ స్థలాలు అందచేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

కొన్ని చోట్ల ప్రభుత్వం భూములను, మరికొన్ని చోట్ల ప్రైవేటు భూములను గుర్తించాల్సి ఉందన్నారు. వీటిపై స్థానిక నాయకులే నిర్ణయం తీసుకొని, గ్రామస్థులకు అనువుగా ఉన్న స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. గుర్తించే భూములు, ఇబ్బందులు లేకుండా అందరికీ అనువుగా ఉండే విధంగా మీరే బాధ్యత తీసుకోవాలన్నారు. స్థలాలు గుర్తిస్తే, తక్షణమే మంజూరు చేస్తామని కాకాణి తెలిపారు. నవ శఖం సర్వేని పూర్తి చేసిన తరువాత అందరికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందిస్తామన్నారు. శస్త్ర చికిత్స చేసుకున్న అనంతరం, వారికి విశ్రాంతి సమయంలో నగదును జగన్ మోహన్ రెడ్డి అందజేస్తున్నారని, ఇలా ఏ ప్రభుత్వం కూడా చేయలేదని, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దేశానికే ఆదర్శం అని ఎమ్మెల్యే కాకాణి హర్షం వ్యక్తం చేశారు. అన్ని విధాలా ఈ ప్రభుత్వం అందరిని ఆదుకుంటుందని అన్నారు.


Tags:    

Similar News