Roja: దౌర్జన్యానికి, గూండాయిజానికి చంద్రబాబు కేరాఫ్.. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఒక్క సీటు కూడా రాదు..
Roja: దౌర్జన్యానికి, గూండాయిజానికి చంద్రబాబు కేరాఫ్ అన్నారు ఏపీ మంత్రి రోజా.
Roja: దౌర్జన్యానికి, గూండాయిజానికి చంద్రబాబు కేరాఫ్.. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఒక్క సీటు కూడా రాదు..
Roja: దౌర్జన్యానికి, గూండాయిజానికి చంద్రబాబు కేరాఫ్ అన్నారు ఏపీ మంత్రి రోజా. పైసాకు పనికిరాని వ్యక్తులతో సీఎం జగన్‌ను తిట్టిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబును, నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితులు లేవన్నారు రోజా. గన్నవరంలో టీడీపీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబును హైదరాబాద్ నుంచి తరిమి కొడతారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం14 మంది వెనుకబడి కులాలకు చెందిన వారికి ఎమ్మెల్సీ పదవులిచ్చి గౌరవించిందని వెల్లడించారు. ప్రజల సంక్షేమానికే సీఎం జగన్ నిత్యం పాటుపడుతున్నారని చెప్పారు. టీడీపీ కార్యకర్తలకు నోరులేస్తే చేతులతో సమాధానం చెబుతామని ఆమె అన్నారు.