Pinipe Vishwaroop: రైతులు టీడీపీ వలలో పడి క్రాప్ హాలిడే పాటించవద్దు..
Crop Holiday: క్రాప్ హాలిడే పేరుతో ప్రభుత్వంపై బురద చల్లడానికి టీడీపీ ప్రయత్నం చేస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఆరోపించారు.
Pinipe Vishwaroop: రైతులు టీడీపీ వలలో పడి క్రాప్ హాలిడే పాటించవద్దు..
Crop Holiday: క్రాప్ హాలిడే పేరుతో ప్రభుత్వంపై బురద చల్లడానికి టీడీపీ ప్రయత్నం చేస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఆరోపించారు. టీడీపీ నేతల వ్యాఖ్యలపై అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో ఆయన స్పందించారు. రాజకీయ లబ్ది కోసం తెలుగుదేశం పార్టీ ఆడుతున్న నాటకమన్నారు. నిజమైన రైతులు తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకు లోనుకాకుండా క్రాప్ హాలీడే ప్రకటనను ఖండించాలని మంత్రి విశ్వరూప్ విజ్ఞప్తి చేశారు.
రైతుభరోసా అమలుతో రైతులకు మేలు చేస్తున్నందుకు క్రాప్ హాలీడే పాటిస్తారా..? అని మంత్రి ప్రశ్నించారు. మరో 48 గంటల్లో ధాన్యం కొనుగోళ్ల తాలూకు నిధులుజమ చేస్తామన్నారు. ఇక జూన్ 1వ తేదీకే సాగునీటి విడుదలతో మూడు పంటలు పండించడానికి అవకాశం కలిగిందన్న మంత్రి ఇప్పటికైనా రైతులు టీడీపీ తప్పుడు ట్రాప్ లో పడకుండా మొదటి పంట సాగు చేసుకోవచ్చని భరోసా ఇచ్చారు.