ఎలక్షన్‌ కమిషన్‌.. మోదీ కమిషన్‌ ఆఫ్‌ ఇండియాగా మారింది : నారా లోకేష్

Update: 2019-05-17 15:57 GMT

ఏపీలో మరోసారి తెలుగుదేశం పార్టీయే అధికారంలోకి వస్తుందని.. చంద్రబాబే మరోసారి సీఎం కానున్నారని అన్నారు… మంత్రి నారా లోకేష్‌. ఈనెల 23న వెలువడనున్న ఫలితాలు టీడీపీకి అనుకూలంగా ఉంటాయని జోస్యం చెప్పారు. తాము రీపోలింగ్‌ కోరినా ఈసీ పట్టించుకోకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. 40 రోజుల తర్వాత రీపోలింగ్‌ పెట్టడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. ఈసీ విడుదల చేస్తానంటున్న వీడియోలు నిజమో కాదో చూడాలన్నారు. ఎలక్షన్‌ కమిషన్‌ మోదీ కమిషన్‌ ఆఫ్‌ ఇండియాగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. ఏపీలో గత ఎన్నికల కంటే ఈ సారి ఎక్కువ సంఖ్యలో సీట్లు సాధిస్తామని లోకేష్‌ ధీమా వ్యక్తం చేశారు. సంపూర్ణ మెజారిటీతో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని తెలిపారు. చంద్రగిరి రీ పోలింగ్‌పై న్యాయస్థానాన్ని ఆశ్రయించామని… చిత్తూరు ఎంపీ అభ్యర్థి శివప్రసాద్ లంచ్ మోషన్ దాఖలు చేసినట్టు వెల్లడించారు. 

Similar News