ఆగ్రహంతో ఊగిపోయిన మంత్రి మేకపాటి.. నీ చరిత్ర అంతా నావద్ద ఉందని..
Mekapati Goutham Reddy: ఎప్పుడు సౌమ్యంగా, శాంతంగా ఉండే మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి కోపం వచ్చింది.
ఆగ్రహంతో ఊగిపోయిన మంత్రి మేకపాటి.. నీ చరిత్ర అంతా నావద్ద ఉందని..
Mekapati Goutham Reddy: ఎప్పుడు సౌమ్యంగా, శాంతంగా ఉండే మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి కోపం వచ్చింది. ఎప్పుడూ నెమ్మదిగా మాట్లాడే ఆయనకు ఓ అధికారి తీరు కోపం తెప్పించింది. నెల్లూరు జిల్లా సంగం మండలంలోని ఎమ్మార్వో కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశంలో ఎమ్మార్వో, ఎంపీడీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అయితే ఆర్ఐ సిరాజ్ మాత్రం సమావేశానికి ఆలస్యంగా వచ్చారు. దీంతో మంత్రి మేకపాటికి కోపం వచ్చింది.
సమావేశానికి హాజరవడానికి సమయపాలన పాటించాల్సిన అవసరం లేదా అంటూ మండిపడ్డారు. గతంలోనూ నీపై ఎన్నో ఆరోపణలు, విమర్శలు వచ్చాయని, నీ చరిత్ర అంతా నావద్ద ఉందని హెచ్చరించారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను విధుల నుంచి రిలీవ్ చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి గౌతంరెడ్డి ఆగ్రహాన్ని చూసిన అధికారులంతా ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు.