Kakani: వ్యవసాయం, ఉద్యాన పంటలు నష్టపోయిన రైతులకు.. సత్వర సాయం అందిస్తాం
Kakani: పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి ఆర్థిక సహాయం అందిస్తాం
Kakani: వ్యవసాయం, ఉద్యాన పంటలు నష్టపోయిన రైతులకు.. సత్వర సాయం అందిస్తాం
Kakani: నెల్లూరు జిల్లాల్లో మిచౌంగ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో తుఫాన్ భీభత్సం సృష్టించినా ముందస్తు జాగ్రత్తలతో ప్రాణ నష్టం జరగకుండా చూశామని కాకాణి అన్నారు. తుఫాను కారణంగా దెబ్బతిన్న పంట పొలాలు, రోడ్లు, భవనాల నష్టాలపై అధికారులు సమగ్ర నివేదికలను సిద్ధం చేస్తున్నారని తెలిపారు. మరో మూడు రోజుల్లో సమగ్ర నివేదికలు సిద్ధమవుతాయన్న ఆయన.. తుఫాను బీభత్సం సృష్టించినా గ్రామం నుంచి డివిజన్ స్థాయి అధికారుల సమన్వయంతో తుఫాన్ ను సమర్థవంతంగా ఎదుర్కోగలిగామని అన్నారు. తుఫాను సమయంలో పనిచేసిన అధికారుల పనితీరు అభినందనీయమన్నారు.