భీమవరంలో రైల్వే అండర్ పాస్ లను ప్రారంభించిన మంత్రి
Bhimavaram: ఏపీ అభివృద్ధికి కోట్లాది నిధులు మంజూరు : కేంద్రమంత్రి మురళీధరన్
భీమవరంలో రైల్వే అండర్ పాస్ లను ప్రారంభించిన మంత్రి
Bhimavaram: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను వెచ్చిస్తున్నట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వి.మురళీధరన్ చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో రైల్వే డబ్లింగ్ పనుల్లో భాగంగా 21 కోట్ల రూపాయలతో నిర్మించిన రైల్వే అండర్ పాస్ లను ఆయన ప్రారంభించారు. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుందన్నారు. గ్రామాల అభివృద్ధి, జాతీయ రహదారులు విస్తరణ, రైల్వే ప్రాజెక్టులు, విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయడం వంటి అనేక అభివృద్ధి పనులను చేస్తుందన్నారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయడంతో పాటు మరెన్నో అభివృద్ధి పనులను చేస్తుందని గుర్తు చేశారు. కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.