CM Chandrababu: 'అమరావతి'కి చట్టబద్ధత కల్పించండి
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబబు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు.
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబబు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. ఏపీ రాజధానిగా అమరావతిని ఖరారు చేసే బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టి చట్టబద్దత కల్పించాలని కోరారు. చట్టబద్దత కల్పించడంతో రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరగడంతో పాటు... రాజధాని కల నెరవేరుతుందని సీఎం చంద్రబుబు వెల్లడించారు.
అయితే ఇటీవల ఉపాధి హామీ పథకం స్థానంలో తెచ్చిన జీ రామ్ జీ పథకంలోని కొన్ని అంశాల నుంచి రాష్ట్రానికి మినహాయింపు కల్పించాలని సీఎం కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ ఆర్థిక వెసులుబాటు కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను ఏపీ సీఎం చంద్రబాబు కోరారు.