AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

AP Cabinet: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ అమరావతి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనున్నది.

Update: 2026-01-08 06:06 GMT

AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

AP Cabinet: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ అమరావతి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనున్నది. పలుకీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. గత సమావేశాల్లో అమలు చేసిన పథకాలపై సమీక్ష, భవిష్యత్తు పెట్టుబడుల ప్రణాళిక, ప్రధాన సదుపాయాల అభివృద్ధి, విద్య, రోడ్లు, పెట్టుబడుల ప్రోత్సాహం వంటి అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యంగా సీఆర్డీఏలో ఆమోదించిన అంశాలకు ఆమోదం తెలుపనుంది.

రాజధాని గ్రామాల్లోని అనాధ పిల్లలకు పెన్షన్లు, కృష్ణానది తీరంలో మెరినా వాటర్ ఫ్రంట్ అభివృద్ధికి భూమి కేటాయింపు అంశాలతో పాటు రాజధానిలో రోడ్డు శూల ఉన్న 112 ప్లాట్లలో మార్పులకు ప్రభుత్వం ఆమోదం తెలుపనున్నది. ఎస్ఐపీబీ లో అమోదించిన ప‌లు పెట్టుబ‌డుల‌కు అమోదం తెల‌ప‌డంతోపాటు 14 సంస్థలకు చెందిన రూ. 19,391 కోట్ల పెట్టుబడుల‌కు అమోదం తెలిపే ఛాన్స్ ఉంది.

Tags:    

Similar News