AP Cabinet Approves 35 Key Proposals: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 35కు పైగా అంశాలకు ఆమోదం

AP Cabinet Approves 35 Key Proposals: ఏపీ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు 35కు పైగా అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Update: 2026-01-08 10:04 GMT

AP Cabinet Approves 35 Key Proposals: ఏపీ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు 35కు పైగా అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ లాజిస్టిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు.. MSME పరిధిలో వచ్చే ఐదేళ్లలో 7వేల 500 మందికి ఉపాధి కల్పనే లక్ష్యంగా ఏపీ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంను ఆమోదించారు. పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు నిర్ణయాలు..బార్లలో అదనపు రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఉపసంహరణపై మంత్రివర్గ ఉపసంఘం నివేదికపై కేబినెట్‌లో చర్చించారు.

మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మైక్రో బ్రూవరీలు ఏర్పాటుపై మంత్రివర్గం చర్చించింది. గ్రామీణ ప్రాంతాల్లో జల్‌జీవన్ ద్వారా నీటి సరఫరాకు రూ.5 వేల కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వ గ్యారెంటీ...కోటబొమ్మాళిలో కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది మంత్రి వర్గం. అలాగే పాఠశాల కిట్‌ల పంపిణీ కోసం 944 కోట్ల పరిపాలన అనుమతులు ఇచ్చింది. సంప్రదాయేతర ఇంధన, విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు...వివిధ సంస్థల భూకేటాయింపులకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

Tags:    

Similar News