పాదయాత్రలు, తలకిందులుగా యాత్రలు చేసినా మాకు నష్టం లేదు - బొత్స
Botsa Satyanarayana: తిరుపతి ఉప ఎన్నికలో కూడా గెలుపు వైసీపీదేనని ధీమా వ్యక్తం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.
మినిస్టర్ బొత్స (ఫోటో: ది హన్స్ ఇండియా)
Botsa Satyanarayana: తిరుపతి ఉప ఎన్నికలో కూడా గెలుపు వైసీపీదేనని ధీమా వ్యక్తం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. జగన్ పాలనకు రాష్ట్ర ప్రజలు నూటికి నూరు మార్కులు వేస్తున్నారన్నారు. బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు బొత్స. సీఎం అభ్యర్థికి, ఉప ఎన్నికకు సంబంధం ఏమిటో బీజేపీ చెప్పాలని సూచించారు. పాదయాత్రలు కాదు, తలకిందులుగా యాత్రలు చేసినా తమ పార్టీకి వచ్చే నష్టం లేదని అన్నారు బొత్స. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో బీజేపీ ప్రజలకు ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. విభజన హామీలను అమలు చేయడంలో బీజేపీ విఫలమైందంటూ ఫైర్ అయ్యారు బొత్స.