Andhra Pradesh: మూడు రాజధానులు మా విధానం- మంత్రి బొత్స

Andhra Pradesh: ఏ క్షణమైనా పరిపాలన రాజధానిని విశాఖకు తరలించే అవకాశం ఉందన్నారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ.

Update: 2021-03-28 14:25 GMT

Andhra Pradesh: మూడు రాజధానులు మా విధానం- మంత్రి బొత్స

Andhra Pradesh: ఏ క్షణమైనా పరిపాలన రాజధానిని విశాఖకు తరలించే అవకాశం ఉందన్నారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. మూడు రాజధానులపై టీడీపీ కోర్టుకు వెళ్లి అడ్డుకుంటుందని విమర్శించారు. మూడు రాజధానులు ప్రభుత్వ విధానమని న్యాయస్థానాన్ని ఒప్పించి రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విధానపరమైన నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పారు.

రాష్ట్రంలో మిగిలిన 32 మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లకు త్వరితగతిన ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాజమహేంద్ర వరంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి బొత్స విలీన గ్రామాలతోనే రాజమండ్రి కార్పోరేషన్ కు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. రాజమండ్రిని మోడల్ సిటీగా తీర్చు దిద్దుతామని చెప్పారు. రాజమహేంద్రవరాన్ని ఒక మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

Tags:    

Similar News