Minister Amarnath: ఫోన్ రికార్డింగ్.. ట్యాపింగ్ వేరు వేరు..
Minister Amarnath: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణలపై స్పందించారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
Minister Amarnath: ఫోన్ రికార్డింగ్.. ట్యాపింగ్ వేరు వేరు..
Minister Amarnath: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణలపై స్పందించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. కోటం రెడ్డి వ్యాఖ్యల్ని ఆయన ఖండించారు. ఫోన్ రికార్డింగ్, ట్యాపింగ్ వేరు వేరు అన్నారు. ఆ ఆడియో క్లిప్ కోటంరెడ్డి స్నేహితుడే ఇంటెలిజెన్స్ చీఫ్ కు పంపి ఉండొచ్చు. రికార్డింగ్ చేసిన ఆ ఆడియో క్లిప్ ను కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఇంటెలిజెన్స్ చీఫ్ పంపి ఉండొచ్చని అమర్నాథ్ అన్నారు. కోటంరెడ్డి పార్టీ మారాలనుకుంటే మారొచ్చు కానీ ఇలాంటి ఆరోపణలు సరికాదని అన్నారు. అమర్నాథ్ వ్యాఖ్యలపై కోటంరెడ్డి వెంటనే స్పందించారు. ఎవరు ఏదైనా మాట్లాడొచ్చు. కానీ ఆధారాలుండాలి. ఇది ట్యాపింగ్ కాదు. కాల్ రికార్డింగ్ అంటున్నారు. అయితే ఈ విషయాన్ని మంత్రి అమర్నాథ్ నిరూపించాలి. నాది ఐఫోన్. మా స్నేహితునిది ఐఫోన్ అని అందులో కాల్ రికార్డింగ్ చేయలేరని కోటంరెడ్డి కౌంటర్ ఇచ్చారు.