టెన్త్ పరీక్ష గదిలో 12 మంది విద్యార్థులే

ఏపీలో టెన్త్ పరీక్షలు నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ వెల్లడించారు.

Update: 2020-06-03 04:33 GMT
Minister adimulapu suresh(file photo)

ఏపీలో టెన్త్ పరీక్షలు నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ వెల్లడించారు.కరోనా కట్టడికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. విజయవాడలోని సమగ్ర శిక్షా అభియాన్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత ఆయన మాట్లాడారు. గతంలో నిర్ణయించిన పరీక్ష కేంద్రాలు పెంచినట్లు వెల్లడించారు.

కరోనా నేపథ్యంలో విద్యార్థుల కోసం 8 లక్షల మాస్కులు సిద్ధం చేశామని, టీచింగ్‌ స్టాఫ్‌కు గ్లౌజులు కూడా రెడీ చేశామని చెప్పారు. ప్రతి కేంద్రంలో గదికి 10 నుంచి 12 మంది విద్యార్థులే ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో నిర్ణయించిన 2,882 పరీక్ష కేంద్రాలు 4,154కు పెంచినట్లు చెప్పారు. ప్రతి గదిలో మాస్కులు, శానిటైజర్లు ఏర్పాటు చేస్తున్నామని,

ప్రతి కేంద్రంలో థర్మల్‌ స్కానర్‌ ఉండేలా 4,500 స్కానర్ల ఏర్పాటుతో పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న కంటైన్మెంట్‌ జోన్లలో పరీక్ష కేంద్రాలు ఉండవు. ఇదే తరహాలో జాగ్రత్తలతో ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు కూడా నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. జూలై చివరికి నాడు–నేడు కింద తొలి దశలో పాఠశాలల్లో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి


Tags:    

Similar News