విశాఖ ప్రమాదంలో కొత్త కోణం.. అర్ధరాత్రి ఫిషింగ్ హార్బర్‌లో పార్టీ ఇచ్చిన యూట్యూబర్
Vizag: పార్టీ జరుగుతున్న బోటులో చెలరేగిన మంటలు
విశాఖ ప్రమాదంలో కొత్త కోణం.. అర్ధరాత్రి ఫిషింగ్ హార్బర్‌లో పార్టీ ఇచ్చిన యూట్యూబర్
Vizag: విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి ఫిషింగ్ హార్బర్‌లో లంగర్ వేసిన బోటులో ఓ యూట్యూబర్ పార్టీ చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ జరిగిన సమయంలో యూట్యూబర్ మద్యం మత్తులో తోటి వారితో గొడవకు దిగినట్టు సమాచారం అందుతోంది. హార్బర్‌లోకి వెళ్లి యూట్యూబర్ పార్టీ చేసుకోవడంపై.. అక్కడికి అతను ఎలా వెళ్లారు..? సెక్యూరిటీ సిబ్బంది వైఫల్యంపై కూడా అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. కాగా.. మంటలు అధికమవ్వడంతో.. యూట్యూబర్ అక్కడినుంచి పరారైనట్టు తెలుస్తుంది.