TTD: తిరుమలలో రేపటి నుంచి మార్చి నెల ఆర్జిత సేవా టికెట్లు

TTD: ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న టీటీడీ

Update: 2023-12-17 03:34 GMT

TTD: తిరుమలలో రేపటి నుంచి మార్చి నెల ఆర్జిత సేవా టికెట్లు

TTD: తిరుమలలో రేపటి నుంచి మార్చి నెల ఆర్జిత సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ.. రేపటి నుంచి ఆర్జిత సేవా టికెట్ల లక్కీ డిప్ కోసం నమోదు ప్రక్రియ కూడా కొనసాగనుంది. ఈనెల 21న కల్యాణోత్సవం, ఊంజల్‌, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకారం, వర్చువల్ సేవా టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ.. 23న అంగ ప్రదక్షిణం, వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. 25న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేస్తారు.

Tags:    

Similar News