Maoist Firing at AOB: ఏవోబీలో మరోసారి కాల్పుల మోత.. ఉలిక్కి పడుతున్న గిరిజనం

Maoist Firing at AOB: చాలాకాలం నుంచి ప్రశాంతంగా ఉన్న ఏవోబీలో మరోసారి కాల్పుల మోత వినిపిస్తోంది.

Update: 2020-07-17 05:24 GMT

Maoist Firing at AOB: చాలాకాలం నుంచి ప్రశాంతంగా ఉన్న ఏవోబీలో మరోసారి కాల్పుల మోత వినిపిస్తోంది. దాదాపుగా ఆరేడు నెలల నుంచి కేవలం అక్కడక్కడా లొంగుబాటులే తప్ప ఎటువంటి కాల్పుల మోత లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్న గిరిజనుల్లో మరోసారి అలజడి రేగుతోంది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే తెలంగాణా రాష్ట్రం భద్రాద్రికి సమీపంలో పోలీసులకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు చోటు చేసుకోగా, సంఘటన గడిచిన రెండు రోజుల్లోనే ఏవోబీలో మరోసారి ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకోవడంతో భవిషత్తులో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇది కేవలం నామమాత్రంగా సమావేశమేనని, దీనిని పెద్దగా తీసుకోవద్దని స్థానికులకు పోలీసులు భరోసా కల్పిస్తున్నారు.

ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దుల్లో (ఏవోబీ) మరోసారి తుపాకుల మోత మోగింది. ఒరిస్సాలోని ముకుడుపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులు మధ్య ఎదురుకాల్పులు చోటుచుసుకున్నాయి. సిబ్బంది రాకను ముందే పసిగట్టిన మావోయిస్టులు చాకచాక్యంగా తప్పించుకోగలిగారు. వారి కోసం అటవీ ప్రాంతంలో కూబింగ్‌ కొనసాగుతోంది. ఘటనా స్థలంలో మావోయిస్టులకు చెందిన కిట్‌బ్యాగ్స్‌, తుపాకీలు, బాంబుల తయారీకి ఉపయోగించి సామాగ్రీ లభ్యమయ్యాయి. తప్పించుకున్న మావోయిస్టుల కోసం ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపు గాలింపు చేపడుతున్నారు. కాగా ప్రశాంతంగా ఉన్న ఏవోబీ సరిహద్దుల్లో గతకొంత కాలం నుంచి మావోయిస్టుల అలజడి వినిపిస్తోంది. దీంతో ఎజెన్సీ గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.


Tags:    

Similar News