Encounter Between Police and Maoists: పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎక్ కౌంటర్.. భద్రాద్రి అడవుల్లో పోలీసుల కూంబింగ్

Encounter Between Police and Maoists: పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎక్ కౌంటర్.. భద్రాద్రి అడవుల్లో పోలీసుల కూంబింగ్
x
Encounter Between Police and Maoists
Highlights

Encounter Between Police and Maoists: ఇటీవల కాలంలో మావోయిస్టుల జాడ తగ్గిన నేపథ్యంలో తెలంగాణాలోని భద్రాద్రిలో ఎన్ కౌంటర్తో మరోమారు వార్తల్లోకి వచ్చారు.

Encounter Between Police and Maoists: ఇటీవల కాలంలో మావోయిస్టుల జాడ తగ్గిన నేపథ్యంలో తెలంగాణాలోని భద్రాద్రిలో ఎన్ కౌంటర్తో మరోమారు వార్తల్లోకి వచ్చారు. బుధవారం పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగినట్టు పోలీసులు చెప్పారు. అయితే ఈ ఘటనలో ఒకరికే గాయలయ్యాయని, మవోయిస్టుల సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు చెబుతున్నారు.

చాలా రోజుల తర్వాత తెలంగాణలో మావోయిస్టుల అలజడి కొనసాగుతోంది. మణుగూరు సబ్ డివిజన్‌లో కరకగూడెం మండలం మల్లెపల్లితోగు అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ పోలీసుకు గాయాలయ్యాయి. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ సునీల్ దత్‌ తెలిపారు. ఉదయం 9.00 గంటలకు పోలీసులు కూంబింగ్ చేపడుతున్న సమయంలో.. మావోయిస్టులు ఎదురుపడ్డారని.. పోలీసులను చూడటంతోనే వారు కాల్పులకు దిగి పారిపోయారు. అయితే సంఘటనా స్థలంలో మందుగుండు సామాగ్రితో పాటు.. పలు ఆయుధాలను వదిలేసి పారిపోయారు. ఓ బ్యాగు, ఆయుధం, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని మొత్తం అదుపులోకి తీసుకుని విస్తృతంగా కూంబింగ్ చేపడుతున్నామన్నారు.

కాగా, ఛత్తీస్‌గడ్ రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో మావోయిస్టులు వచ్చి తెలంగాణ ప్రాంతంలోని గిరిజనులను, స్థానికులను రిక్రూట్‌ చేసేందుకు ప్లాన్‌ వేస్తున్నట్లు నిఘా వర్గాలు సమాచారాన్ని సేకరించాయి. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ అలర్ట్ అయ్యింది. ముందస్తు జాగ్రత్తగా.. ఖమ్మం, ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలకు సెక్యూరిటీని పెంచారు. ఏజెన్సీ ప్రాంతాలలో తమకు సమాచారం లేకుండా ప్రజాప్రతినిధులు పర్యటనలు చేయవద్దని పోలీసులు సూచించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories