అన్నమయ్య జిల్లాలో దారుణం.. కుక్కల దాడి నుంచి తప్పించుకోబోయి యువకుడి మృతి

అన్నమయ్య జిల్లా రాయచోటిలో దారుణం జరిగింది. మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి అయింది.

Update: 2025-12-08 06:17 GMT

అన్నమయ్య జిల్లాలో దారుణం.. కుక్కల దాడి నుంచి తప్పించుకోబోయి యువకుడి మృతి

అన్నమయ్య జిల్లా రాయచోటిలో దారుణం జరిగింది. మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి అయింది. రాయచోటిలోని లక్ష్మీపురంలో నివాసం ఉండే పజిల్.. గాలివీడు రోడ్డులో బైకుపై తన ఇంటికి వెళ్తోన్న సమయంలో కుక్కలు వెంటపడ్డాయి. కుక్కల బారి నుంచి తప్పించుకోవాలని బైకు వేగంగా నడపి ఎదురుగా ఉన్న గుడిని ఢీకొని అక్కడిక్కడే మృతిచెందాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రాయచోటిలో రోడ్లపై ఎక్కడికక్కడ ఆవులు, కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రోడ్లపై కుక్కలు, ఆవులు తిరుగుతున్నాయని మున్సిపాలిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్తే చలనం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి మరో ప్రాణం బలి కాకుండా చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు వేడుకుంటున్నారు. 

Tags:    

Similar News