Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తర కోస్తా జిల్లాలు, తెలంగాణలో భారీ వర్షాలు

Weather Update: వాయువ్య బంగాళాఖాతంలో సుస్పష్ట అల్ప పీడనం కొనసాగుతోందన్నారు వాతావరణ కేంద్ర అధికారి జగన్నాధ కుమార్.

Update: 2025-09-03 10:14 GMT

Weather Update: వాయువ్య బంగాళాఖాతంలో సుస్పష్ట అల్ప పీడనం కొనసాగుతోందన్నారు వాతావరణ కేంద్ర అధికారి జగన్నాధ కుమార్. పశ్చిమ వాయువ్య దిశగా ఒడిశా, బెంగాల్ వైపు అల్పపీడనం కదులుతుందన్నారు. మరో వైపు బికనూర్ నుంచి సంబల్పూర్ బిలాస్పూర్ వరకు బలంగా రుతుపవనాల ద్రోణి ప్రభావం చూపుతుందన్నారు. రానున్న 24 గంటల్లో ఉత్తరకోస్తా, మన్యం అల్లూరి జిల్లాలకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. దక్షిణ కోస్తాలో మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉందన్నారు. 

Tags:    

Similar News