Nara Lokesh: ముంబైలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటన
Nara Lokesh: ఏపీ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీతో ముందుకు సాగుతుందని ఏపి మంత్రి నారా లోకేష్ చెప్పారు.
Nara Lokesh: ఏపీ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీతో ముందుకు సాగుతుందని ఏపి మంత్రి నారా లోకేష్ చెప్పారు. ముంబైలో వ్యాపార దిగ్గజాలు, ఇన్వెస్టర్లతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. సీఎం చంద్రబాబు చొరవతో విశాఖకు వస్తున్న సీ ల్యాండ్ కేబుల్స్ ముంబై కంటే రెండింతలు శక్తి వంతంగా ఉంటాయన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి కంపెనీలు కేవలం 99 పైసలకే ఎకరా చొప్పున భూములు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదని స్పష్టం చేశారు.
విద్యుత్ చార్జీలను యూనిట్‌కు 13 పైసలు తగ్గించడం మా సమర్థవంతమైన పరిపాలనకు నిదర్శన మన్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ విజయవంతం చేయాలన్నారు.