Lockdown Guidelines in Guntur District: గుంటూరులో లాక్ డౌన్.. నిబంధనలు ఇవే.. ఉల్లంగిస్తే చర్యలు తప్పవు!

Lockdown Guidelines in Guntur District: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే..

Update: 2020-07-17 08:00 GMT
Representational Image

Lockdown Guidelines in Guntur District: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. కేసులతో పాటగా మరణాలు కూడా భారీగానే నమోదు అవుతున్నాయి. ఇక ఏపీలో ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆ జిల్లాలో ఇప్పటి వరకు 5000కి పైగా కరోనా కేసులు నమోదు కాగా, అందులో 1829 మంది కరోన మహమ్మరిని జయించగా, ఇప్పటివరకూ 32 మంది కరోనాకు బలి అయిపోయారు.

ఈ క్రమంలో కరోనాని అడ్డుకోవడానికి శనివారం నుంచి జిల్లా వ్యాప్తంగా పూర్తి లాక్ డౌన్ అమలలో ఉంటుందని అక్కడి జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ వెల్లడించారు. నిత్యవసర సరకుల కోసం ఉదయం 6 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని అయన స్పష్టం చేశారు. ఇలా పూర్తిగా వారం రోజుల పాటు పూర్తి లాక్ డౌన్ అమలులో ఉంటుందని అవసరం అయితే తప్ప జనాల్లు బయటకి రావొద్దని అయన వెల్లడించారు.

అంతేకాకుండా ప్రతి ఒక్కరూ మాస్క్ కచ్చితంగా ధరించాలని, దానితో పాటుగా సామాజిక దూరం పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక ఎప్పటికప్పుడు శానిటైజర్లు వియోగించాలని జిల్లా ప్రజలకు సూచనలు జారీ చేశారు. కరోనా నియంత్రణకి ప్రతి ఒక్కరూ సహకరించలని, ఒకవేళ ఈ నిబంధనలు ఉల్లంగిస్తే మాత్రం చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

ఇక ఏపీలో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 22,304 శాంపిల్స్‌ని పరీక్షించగా 2584 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 943 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి మొత్తం రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 35,159కి చేరుకుంది.

ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 492గా ఉంది. ఇక ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 16,975కి చేరగా, ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 17,692 మంది చికిత్స పొందుతున్నారు.

Tags:    

Similar News