AP Weather Alert: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. నేడు కోస్తా, రాయలసీమలోని 9 జిల్లాల్లో మోస్తరు వర్షాలు

AP Weather Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో రెండు రోజులపాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది.

Update: 2025-11-05 06:11 GMT

AP Weather Alert: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. నేడు కోస్తా, రాయలసీమలోని 9 జిల్లాల్లో మోస్తరు వర్షాలు

AP Weather Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో రెండు రోజులపాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. ఏపీ తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఆవర్తనం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. దీని ఫలితంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేశారు.

కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అలాగే ఎల్లుండి నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్నప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు. ఆకస్మిక వర్షాల సమయంలో చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని స్పష్టం చేశారు.

Tags:    

Similar News