విశాఖపట్నం "స్టీల్ ప్లాంట్" ను కాపాడుకుందాం: కార్మిక సంఘాలు

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకుందాం అనే నినాదంతో విశాఖపట్నంలో ప్రారంభమై ప్రచార యాత్ర గురువారం తుని చేరుకుంది.

Update: 2019-12-12 11:57 GMT

తుని: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకుందాం అనే నినాదంతో విశాఖపట్నంలో ప్రారంభమై ప్రచార యాత్ర గురువారం తుని చేరుకుంది. తూర్పుగోదావరి జిల్లా ఏ. ఐ. టి. యు. సి. జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, సమితి సభ్యులు శివ కోటి రాజు, సి ఐ టి యు రాష్ట్ర నాయకులు శేషు బాబ్జి, అంగన్వాడి రాష్ట్ర నాయకురాలు బేబీ రాణి, ప్రచార యాత్రకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఉక్కు పరిశ్రమను సాధించుకోగలమని, అలాంటి ఉక్కు పరిశ్రమను ఇవాళ ప్రైవేట్ వ్యక్తులకు దోచి పెడితే ఊరుకోమని ఆయన హెచ్చరించారు.

ఉద్యమం తీవ్రతరం చేస్తూ ఉద్యమానికి ప్రజల మద్దతు కూడా తీసుకుంటామని అని తెలియజేశారు. బేబీ రాణి మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటాల ఫలితమే అని దీన్ని ప్రైవేటు పరం కానివ్వమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ఆస్తులు కాపాడుకోవడానికి ఎంతటి తీవ్ర ఉద్యమమైనా చేపడతామని ఆమె తెలియజేశారు. కార్యక్రమంలో ఏ. ఐ. టి.యు. సి ఆదినారాయణ, కె సత్యనారాయణ, సీఐటీయూ సి హెచ్. నర్సింగరావు, వెంకట్రావు, ఐఎన్టియుసి, మస్తాన్ అప్పా, వై ఎస్ ఆర్ టి యు, రామ్ మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Tags:    

Similar News