తిరుపతి SV యూనివర్సిటీ వద్ద మరోసారి చిరుత కలకలం

తిరుపతిలో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. ఎస్వీయూలోని ఉద్యోగుల క్వార్టర్స్‌లో చిరుత సంచరిస్తోంది.

Update: 2025-11-26 06:26 GMT

తిరుపతిలో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. ఎస్వీయూలోని ఉద్యోగుల క్వార్టర్స్‌లో చిరుత సంచరిస్తోంది. ఉద్యోగుల ఇళ్ల ఎదుట పెంచుతున్న కోళ్లపై దాడికి యత్నించింది. అక్కడున్న సీసీ కెమెరాల్లో చిరుత కదలికలు రికార్డయ్యాయి. దీంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఉద్యోగులు, విద్యార్థులు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు.. చిరుతను బంధించేందుకు బోన్లను ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి వేళల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Tags:    

Similar News