Anantapur: వామ్మో.. చిరుత రైతులపై దాడి

Anantapur: పొలంలో పనిచేస్తుండగా దాడి చేసిన చిరుత

Update: 2024-01-17 08:00 GMT

Anantapur: వామ్మో.. చిరుత రైతులపై దాడి

Anantapur: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లిలో చిరుత సంచారం భయాందోళనకు గురి చేసింది. పొలంలో పనులు చేసుకుంటున్న ఓ రైతుపై చిరుత ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో భయాందోళనకు గురైన రైతులు గాయపడిన రాము అనే రైతును కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో వన్యప్రాణులు తరచు సంచరిస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు.

ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. పొలం పనులకు వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Tags:    

Similar News