ఉమామహేశ్వరి మరణం మిస్టరీగా మారింది.. సంచలన ఆరోపణలు చేసిన లక్ష్మీ పార్వతి
Lakshmi Parvathi: ఎన్టీఆర్ కుమార్తె మరణం మిస్టరీగా మారిందని వైసీపీ జనరల్ సెక్రటరీ లక్ష్మి పార్వతి అనుమానం వ్యక్తం చేశారు.
ఉమామహేశ్వరి మరణం మిస్టరీగా మారింది.. సంచలన ఆరోపణలు చేసిన లక్ష్మీ పార్వతి
Lakshmi Parvathi: ఎన్టీఆర్ కుమార్తె మరణం మిస్టరీగా మారిందని వైసీపీ జనరల్ సెక్రటరీ లక్ష్మి పార్వతి అనుమానం వ్యక్తం చేశారు. ఉమ మహేశ్వరి మరణం వెనుక ఏదో ఉందన్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు రాసిన లెటర్... చంద్రబాబు వచ్చాక మాయమైందని ఆరోపించారు. చంద్రబాబు నీచ రాజకీయాలు తెలిసిన వారు కాబట్టి అనుమానించక తప్పదన్నారు. ఆ కుటుంబానికి చంద్రబాబు ఒక శనిలా పట్టుకున్నాడని లక్ష్మీ పార్వతి విమర్శించారు. ఇప్పటికైనా పార్టీని బాలకృష్ణకు అప్పజెప్పి పక్కకు తప్పుకో ఈ విషయంలో ఏమీ లేదంటే నువ్వు వెంటనే సీబీఐ విచారణకు లేఖ రాయాలి, నీకు రాయడం చేతకాకపోతే నేనే సీబీఐకి లేఖలు రాస్తా, సీబీఐ క్లీన్ చిట్ ఇస్తే కానీ నిన్ను నమ్మలేను అంటూ ఆమె చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు.