Lakshmi Parvathi: చంద్రబాబు చేయలేని పని జగన్ చేశారు.. ఎంతో ఆనందంగా ఉంది..
Lakshmi Parvathi: విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు లక్ష్మీపార్వతి.
Lakshmi Parvathi: చంద్రబాబు చేయలేని పని జగన్ చేశారు.. ఎంతో ఆనందంగా ఉంది..
Lakshmi Parvathi: విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని లాక్కొని పదవులు అనుభవించిన చంద్రబాబు చేయని పని సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసి చూపించారన్నారు. ఇన్నాళ్లకు ఎన్టీఆర్ అభిమానుల కోరిక తీరింది అని అన్నారు. ఎన్టీఆర్ తో ఎలాంటి సంబంధం లేనప్పటికీ సీఎం జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారని అభినందించారు. ఎన్టీఆర్ జిల్లా ఏపీలోనే మంచి పేరు తెచ్చుకుంటుందని ఆశిస్తున్నానని చెప్పారు. ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరు అయినా విజయవాడతో ఎక్కువ అనుబంధం ఉందన్నారు.