Pushpa Sreevani: విద్యార్ధులకు హెపటైటిస్ సోకితే ప్రభుత్వానికి చలనం లేదు

Pushpa Sreevani: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో విద్యార్థుల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి.

Update: 2025-10-13 06:04 GMT

Pushpa Sreevani: విద్యార్ధులకు హెపటైటిస్ సోకితే ప్రభుత్వానికి చలనం లేదు

Pushpa Sreevani: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో విద్యార్థుల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. జిల్లాలోని ఏకలవ్య స్కూల్, సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి సందర్శించారు. విద్యార్ధులకు హెపటైటిస్ సోకితే ప్రభుత్వానికి చలనం లేకపోవడం ఏంటని ఆమె ప్రశ్నించారు. గిరిజనులకు అండగా ఉంటానంటూ ప్రకటనలే తప్ప చేసిందేమి లేదంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ఆమె మండిపడ్డారు.

గిరిజనులకు చొప్పులు, పళ్ళు ఇచ్చినంత మాత్రనా గిరిజన పక్షపాతి అయిపోరంటూ విరుచుకుపడ్డారు. విద్యార్థుల మరణాలపై హ్యూమన్ రైట్స్‌, సెంట్రల్ ఎస్టీ కమిషన్‌‌కు ఫిర్యాదు చేయడానికి వైసీపీ బృందం ఢిల్లీకి వెళ్లనుందని తెలిపారు. మరణించిన విద్యార్థుల కుటుంబాలకు వైసీపీ ప్రకటించిన 5 లక్షల రూపాయల చెక్కును త్వరలో అందజేస్తామని స్పష్టం చేశారు.

Tags:    

Similar News