కర్నూలు జిల్లాలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై
కర్నూలు జిల్లాలో ఓ ఎస్సై లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
కర్నూలు జిల్లాలో ఓ ఎస్సై లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నంద్యాల జిల్లా యనకండ్ల గ్రామానికి చెందిన శివనాగిరెడ్డిపై మహిళా పోలీసు స్టేషన్లో తన భార్య వేధిపుల కేసు పెట్టింది. ఈక్రమంలో శివనాగిరెడ్డిపై హత్య యత్నం కేసు నమోదు అయ్యిందని.. అరెస్టు చేస్తారని ఎస్.ఐ. కిరణ్ కుమార్ అబద్దం చెప్పాడు. అరెస్టు చేయకుండా ఉండాలంటే ముప్పై వేల రూపాయలు లంచం ఇవ్వాలని శివనాగిరెడ్డిని ఎస్.ఐ డిమాండ్ చేశారని ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు. లంచం డబ్బులు 30వేలు ఎస్.ఐ. ఇంటి వద్ద ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లేని సెక్షన్ ఉన్నట్లు చెప్పి భయపెట్టి లంచం తీసుకోవడంపై కేసు నమోదు చేసి అరెస్టు చేస్తున్నామని డిఎస్పీ తెలిపారు.