తాడేపల్లికి చేరిన ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి వ్యవహారం.. సీఎంతో భేటీ..

Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ అసంతృప్తి వ్యవహారం తాడేపల్లికి చేరింది.

Update: 2023-01-02 12:41 GMT

తాడేపల్లికి చేరిన ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి వ్యవహారం.. సీఎంతో భేటీ..

Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ అసంతృప్తి వ్యవహారం తాడేపల్లికి చేరింది. సీఎం జగన్‌ను కలవడానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తాడేపల్లి చేరుకున్నారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. ఇటీవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేశారు. నెల్లూరు గ్రామీణంలో 2వేల,700 పింఛన్‌లు తొలగించడంపై వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో రోడ్లు సరిగాలేవని అసంతృప్తి వ్యక్తం చేసిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. పొట్టెపాలెం వద్ద వంతెన నిర్మాణ నిధుల కొరత ఉందన్నారు. మురుగు కాలువల సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. దీంతో సీఎం జగన్ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పిలిపించారు. విమర్శలు ఎందుకు చేయాల్సి వచ్చిందో సీఎంకు వివరణ ఇవ్వనున్నారు.

Tags:    

Similar News