Kodali Nani: గుడివాడ ఆర్టీసీ డిపో గ్యారేజ్ నిర్మాణం కంప్లీట్
Kodali Nani: దాదాపు 8.98 కోట్లతో గుడివాడ ఆర్టీసీ డిపో గ్యారేజ్
Kodali Nani: గుడివాడ ఆర్టీసీ డిపో గ్యారేజ్ నిర్మాణం కంప్లీట్
Kodali Nani: గుడివాడ ఆర్టీసీ డిపో గ్యారెజ్ నిర్మాణం పూర్తి అయినట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని వెల్లడించారు. దాదాపు 8.98 కోట్లతో నూతనంగా నిర్మించిన ఈ గ్యారెజ్‌ను మాజీ మంత్రులు పేర్నినాని, కొడాలి నాని ప్రారంభించారు. సోమవారం బస్టాండ్ నిర్మాణానికి టెండర్లు పిలుస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు వచ్చే నెల 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందన్నారు. పులివెందుల తర్వాత 20 కోట్లతో బస్టాండ్ నిర్మిస్తున్నది గుడివాడలోనే అని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడు టీడీపీ నేత చంద్రబాబు నాయడుపై పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు కొడాలి నాని.