నాపై బురద జల్లేందుకు టీడీపీ, జనసేన వర్గీయుల కుట్ర : కొడాలి నాని

Update: 2021-01-04 13:06 GMT

ఏపీ పౌర సరఫరాల మంత్రి కొడాలి నాని తన స్టైల్ లో చంద్రబాబునాయుడిపై విరుచుకు పడ్డారు. దేవాలయాలు ధ్వంసం చేయించి, వాటిని రాజకీయంగా వాడుకుంటున్నారని విమర్శలు కురిపించారు. దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం చంద్రబాబు డైరెక్షన్ లోనే జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు.

గుడివాడ నియోజకవర్గంలో పేకాట స్థావరాలను తను నిర్వహిస్తున్నట్లు కొందరు టీడీపీ వర్గీయులు ఆరోపిస్తున్నారని, పేకాటలు నిర్వహించి డబ్బు సంపాదించాల్సిన అవసరం తనకు లేదని వివరించారు నాని. తనపై బురద చల్లేందుకు టీడీపీ, జనసేన ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. తను, సీఎం జగన్ ఆదేశిస్తేనే పేకాట స్థవరాలపై పోలీసులు దాడులు చేశారని తెలిపారు. గతంలో దేవినేని ఉమా క్లబ్బుల్లో డబ్బులు వసూలు చేసి లోకేష్ కి ఇచ్చేవారని నాని ఆరోపించారు. పేకాట నిర్వహణ వెనుక ఎంత పెద్దవారు ఉన్న సహించేది లేదని, చివరకు చంద్రబాబు ఉన్నా వదలమని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో సంబంధం లేని తనపై బురద జల్లేందుకు టీడీపీ, జనసేన వర్గీయులు ప్రయత్నం చేస్తున్నారని నాని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక సీఎం జగన్ సివిల్ సప్లైస్ పై సమీక్ష నిర్వహించారని, సంక్రాంతి లోపు రైతులకు బకాయిలు చెల్లించాల్సిందిగా ఆదేశించినట్లు మంత్రి కొడాలి నాని తెలిపారు. అలాగే రంగు మారిన, మొలకెత్తిన ధాన్యం కొనుగోలు పై కూడా చర్చకు వచ్చినట్లు మంత్రి తెలిపారు.

Tags:    

Similar News