Gudivada: ఆన్ లైన్ లో తప్పులుంటే సరి చేసుకోండి: మంత్రి కొడాలి నాని

శుక్రవారం స్థానిక రాజేంద్రనగర్ లోని ఇంటి దగ్గర మంత్రి కొడాలి నానిని పట్టణంలోని సత్యనారాయణపురానికి చెందిన కాట్రగడ్డ అప్పారావు కలిశారు.

Update: 2020-01-31 10:37 GMT
మంత్రి కొడాలి నాని

గుడివాడ: రేషన్ కార్డులు, పెన్షన్ లకు సంబంధించి ఆన్ లైన్ లో ఏవైనా తప్పులుంటే గ్రామ, వార్డు వాలంటీర్ ల ద్వారా సరిచేసుకోవాలని రాష్ట్ర పౌరసర ఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. శుక్రవారం స్థానిక రాజేంద్రనగర్ లోని ఇంటి దగ్గర మంత్రి కొడాలి నానిని పట్టణంలోని సత్యనారాయణపురానికి చెందిన కాట్రగడ్డ అప్పారావు కలిశారు.

తనకు ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్ వస్తోందని, ఈ పెన్షన్ తో పాటు బియ్యం కార్డు కూడా తొలగిస్తున్నట్టుగా వార్డు సచివాలయంలో చెబుతున్నారని అప్పారావు అన్నారు. దీనిపై మంత్రి కొడాలి నాని మాట్లా డుతూ అర్హత ఉన్న ఏ ఒక్కరి పెన్షన్, రేషన్ కార్డులను తొలగించే ప్రసక్తే ఉండదన్నారు. ఆన్ లైన్ లో ఏవైనా తప్పులు దొర్లితే అర్హతలకు సంబంధించిన అన్ని పత్రాలను సచివాలయ ఉద్యోగులకు అందజేయాలని మంత్రి కొడాలి నాని సూచించారు.


Tags:    

Similar News