నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కిడ్నాప్ కేసు..
Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కిడ్నాప్ కేసు నమోదయింది.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కిడ్నాప్ కేసు..
Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కిడ్నాప్ కేసు నమోదయింది. వైసీపీకి చెందిన 22వ డివిజన్ కార్పొరేటర్ విజయభాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తనతోపాటు వైసీపీని వీడాలని ఫోన్ చేసి ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. తనకు ఇష్టం లేదని.. వైసీపీలోనే కొనసాగుతానని కార్పొరేటర్ విజయభాస్కర్ రెడ్డి చెప్పారు. తనను బలవంతంగా కారులో ఎక్కించేందుకు యత్నించాడని విజయ్ భాస్కర్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే అనుచరుడు మిద్దే మురళీకృష్ణ యాదవ్, కారు డ్రైవర్ అంకయ్య పేర్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. IPC 448, 363, 34 సెక్షన్ల కింద ముగ్గురిపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు పోలీసులు.