Tirupati: తిరుపతి బస్టాండ్ లో కిడ్నాపైన బాలుడు సేఫ్
Tirupati: కిడ్నాపర్ల చెర నుంచి బాలుడిని కాపాడిన స్థానిక మహిళ
Tirupati: తిరుపతి బస్టాండ్ లో కిడ్నాపైన బాలుడు సేఫ్
Tirupati: తిరుపతిలో ఇవాళ ఉదయం కిడ్నాప్‌నకు గురైన బాలుడు సురక్షితంగానే ఉన్నాడు. కిడ్నాపర్ల చెర నుంచి ఓ మహిళ బాలుడిని కాపాడి.. స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించింది. ప్రస్తుతం ఏర్పేడులోని పోలీసుల వద్ద బాలుడు సేఫ్‌గా ఉన్నాడు. ఇవాళ ఉదయం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో రెండేళ్ల బాలుడు కిడ్నాప్‌నకు గురయ్యాడు. రాత్రి రెండున్నర గంటల సమయంలో రిజర్వేషన్ కౌంటర్ వద్ద బాలుడిని ఎత్తుకెళ్లారు గుర్తుతెలియని వ్యక్తులు. అయితే.. రాత్రి 12 గంటల 20 నిమిషాల సమయంలో బస్టాండ్‌లో ఉన్న సీసీ కెమెరాల్లో బాలుడి కుటుంబం నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. బాలుడి కిడ్నాప్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత కుటుంబం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేశారు. బాధిత కుటుంబం.. శ్రీవారి దర్శనం కోసం చెన్నై నుంచి వచ్చింది. బాలుడు కనిపించకుండా పోయేసరికి.. కన్నీరుమున్నీరయ్యారు తల్లిదండ్రులు. బాలుడు క్షేమంగానే ఉండటంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు.