మంత్రి గౌతమ్‌ హఠాన్మరణంపై అపోలో వైద్యుల కీలక ప్రకటన

మంత్రి గౌతమ్‌ హఠాన్మరణంపై అపోలో వైద్యుల కీలక ప్రకటన

Update: 2022-02-21 08:27 GMT

మంత్రి గౌతమ్‌ హఠాన్మరణంపై అపోలో వైద్యుల కీలక ప్రకటన

Apollo Hospitals: ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం చెందారు. మంత్రి గౌతమ్ రెడ్డి గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయన్ను హైదరాబాద్ ఆస్పత్రిలో చేర్చారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసారు. అయితే ఆయన మరణంపై అపోలో వైద్యులు కీలక ప్రకటన చేశారు. ఇవాళ ఉదయం 9.16 గంటలకు గౌతమ్‌రెడ్డి మృతిచెందినట్లు అపోలో వైద్యులు ప్రకటించారు.

గౌతమ్‌రెడ్డి ఇంటి దగ్గర కుప్పకూలారు. ఉదయం 7.45 గంటలకు గౌతమ్‌రెడ్డిని అపోలో ఆస్పత్రికి తీసుకువచ్చారు. స్పందించని స్థితిలో గౌతమ్‌రెడ్డిని ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆయన ఆస్పత్రికి వచ్చే సమయానికి శ్వాస ఆడట్లేదు. కార్డియాల‌జిస్టులు, క్రిటిక‌ల్ కేర్ డాక్ట‌ర్లు క‌లిసి మంత్రికి 90 నిమిషాల‌కు పైగా సీపీఆర్ చేశారు. వైద్యులు తీవ్రంగా శ్ర‌మించినా ఫ‌లితం లేకుండా పోయింది. సోమ‌వారం ఉద‌యం 9:16 గంట‌ల‌కు క‌న్నుమూసిన‌ట్లు అపోలో వైద్యులు ప్ర‌క‌టించారు.

Tags:    

Similar News