AP Excise Department: ఏపీ ఎక్సైజ్‌శాఖ కీలక నిర్ణయం
AP Excise Department: సెబ్ రద్దు చేస్తూ నిర్ణయం
AP Excise Department: ఏపీ ఎక్సైజ్‌శాఖ కీలక నిర్ణయం
AP Excise Department: వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో సెబ్ పూర్తిగా రద్దు కానుంది. దీనికి కేటాయించిన 4వేల 393 మంది ఎక్సైజ్ సిబ్బందిని తిరిగి మాతృశాఖలోకి తీసుకురానున్నారు. సెబ్ ఏర్పాటు కాకముందు ఎక్సైజ్‌శాఖ స్వరూపం ఎలా ఉండేదో అదే తరహా వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించనున్నారు.
ఇవాళ లేదా రేపు దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు విడుదల కానున్నాయి. ఒక్కో ఉమ్మడి జిల్లాకు ఒక్కో డిప్యూటీ కమిషనర్‌ను ఎక్సైజ్‌శాఖ పరిపాలన వ్యవహారాల బాధ్యతలు చూడటం కోసం నియమించనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 208 సెబ్ స్టేషన్లు ఉన్నాయి. వీటన్నింటినీ ఎక్సైజ్ స్టేషన్లుగా మార్చనున్నారు. ప్రతి స్టేషన్‌కు ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి S.H.O గా ఉంటారు.