Gorantla Madhav: వైసీపీ నేతల ఇళ్లపై దాడులు చేస్తే.. కంటికి కన్ను.. పంటికి పన్ను..
Gorantla Madhav: ప్రజాస్వామ్య ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని రాజ్యసభ సభ్యుడు గోరంట్ల మాధవ్ అన్నారు.
Gorantla Madhav: వైసీపీ నేతల ఇళ్లపై దాడులు చేస్తే.. కంటికి కన్ను.. పంటికి పన్ను..
Gorantla Madhav: ప్రజాస్వామ్య ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని రాజ్యసభ సభ్యుడు గోరంట్ల మాధవ్ అన్నారు. ఏపీలో ఏర్పడిన కొత్త ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నామని ప్రకటించారు. గెలుపు ఉత్సాహంలో సంబరాలు చేసుకుంటే తమకు అభ్యంతరం లేదని, దాడులకు పాల్పడితే మాత్రం చూస్తూ ఊరుకోబోమని అన్నారు.
టీడీపీ దాడులపై అధికారులకు ఫిర్యాదు చేస్తామని, అప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోతే తామేంటో చూపిస్తామన్నారు. అయితే ప్రభుత్వం మారగానే వైసీపీ నేతల ఇళ్లపై దాడులకు తెగబడుతున్నారని ఒక దశ వరకూ చూసి తాము కూడా కంటికి కన్ను పంటికి పన్ను నినాదంతో ముందుకు వెళ్తామని హెచ్చరించారు.