జనసేనతో కలిసి స్థానిక ఎన్నికల్లో పోటి : కన్నా

Update: 2020-02-10 05:32 GMT

రాబోయే స్థానిక ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటి చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. విజయనగరం వచ్చిన ఆయన ఒక ప్రయివేటు హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ విషయాన్నీ స్పష్టం చేసారు. ఇక వైసీపీ నాయకులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసమే 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారని కన్నా విమర్శించారు. ఆమరావతిని కాదని మూడు రాజధానుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు. ఇక రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రాజెక్టులన్నింటినీ కేంద్రం కేటాయించిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి పాకలపాటి సన్యాసిరాజు, జిల్లా అధ్యక్షులు రెడ్డి పావని, పైడి వేణుగోపాల్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భవిరెడ్డి శివప్రసాద్‌ రెడ్డి, పాణంగపల్లి అశోక్‌, నాయకులు పాల్గొన్నారు. ఇక జనవరి మూడోవారంలో బీజేపీ, జనసేన ఒక్కటయ్యాయి. రెండు మిత్రపక్షాలుగా కలిసి అధికారమే లక్ష్యంగా 2024 ఎన్నికలకు సిద్దమవుతామని ఇప్పటికే రెండు పార్టీల నేతలు ప్రకటించారు.

Tags:    

Similar News