అసలు జరిగింది ఫోన్ ట్యాపింగ్ కాదు.. మ్యాన్ ట్యాపింగ్.. కోటంరెడ్డికి మంత్రి కాకాణి కౌంటర్..

Kakani Govardhan Reddy: కోటంరెడ్డి కి మంత్రి కాకాణి కౌంటర్

Update: 2023-02-03 07:51 GMT

Kakani Govardhan Reddy: చంద్రబాబు..శ్రీధర్ రెడ్డిని ట్యాప్ చేశారంటూ కామెంట్ 

Kakani Govardhan Reddy: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంత్రి కాకాణి గవర్థన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం ఉదయం ప్రెస్ మీట్ పెట్టిన కోటంరెడ్డి వైసీపీ నేతలపై పలు ఆరోపణలు చేశారు. తరువాత వెంటనే కాకాణి గోవర్దన్ రెడ్డికూడా ప్రెస్ మీట్ పెట్టారు. కోటంరెడ్డి వైసీపీ పై బురద జల్లడం సరికాదన్నారు. ఫోన్ టాపింగ్ పై ఫిర్యాదు చేస్తానని చెప్పిన కోటం రెడ్డి ఇప్పటి వరకూ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అసలు జరిగింది ఫోన్ ట్యాపింగ్ కాదని, మ్యాన్ ట్యాపింగ్ అని కాకాణి అన్నారు. చంద్రబాబు నాయుడు శ్రీదర్ రెడ్డిని ట్యాప్ చేశారని కాకాణి అన్నారు.

Tags:    

Similar News